మంత్రి చామకూర మల్లారెడ్డి
డబిల్‌పూర్‌లో 1.05 కోట్లతో బీటీ రోడ్డు పనులు ప్రారంభం
మేడ్చల్ రూరల్ , ఏప్రిల్ 9 : టీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని డబిల్‌పూర్‌లో రూ.1.05 కోట్ల పంచాయతీరాజ్ నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు పనులను మంత్రి ముఖ్య అతిథిగా హాజరై శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గీతాభాగ్యారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… ఉమ్మడి పాలకుల హయాంలో పల్లెలు అభివృద్ధికి ఆమడదూరంగా ఉండేవన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారాయని చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పారిశుధ్యం, పచ్చదనంతో కళకళలాడే వీధులు నేడు దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. డంపింగ్‌యార్డుల నిర్మాణంతో పారిశుధ్యం మెరుగుపడిందన్నారు.
డబిల్పూర్ను అభివృద్ధికి ఆదర్శంగా తీర్చిదిద్దారని సర్పంచును ప్రశంసించారు. అనంతరం గ్రామాభివృద్ధికి మంత్రి సహాయం చేస్తున్నారని సర్పంచ్ గీతాభాగ్యారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రజితారెడ్డి, జడ్పీటీసీ శైలజారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, పీఏసీఎస్ చైర్మన్లు సురేశ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ సత్యనారాయణ, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు గౌస్, ఎంపీటీసీ హేమలత, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ రాజమల్లారెడ్డి, భాగ్యారెడ్డి, అశోక్, శ్రీరాంరెడ్డి, శ్రీనివాస్, ప్రవీణ్, నరేశ్, రాజమల్లేశ్, హరిబాబు, శ్రీనివాస్, రామోదర్ రెడ్డి పాల్గొన్నారు.
భవిష్యత్ యువతదే. : మంత్రి
మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 9 : విషయ పరిజ్ఞానంపై పట్టు సాధిస్తే భవిష్యత్తు యువతదేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ సెట్ 20వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కువ శాతం యువ జనాభా ఉన్న దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. నైపుణ్యాలను పెంపొందించుకుంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉందన్నారు. ప్రతి అంశంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యత పెరిగినందున పట్టు సాధించాలని సూచించారు. వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్, అంతర్జాతీయ కళాకారుడు శివమణి బృందం నిర్వహించిన సంగీత విభావరి విద్యార్థులు, ఆహూతులను ఆకుట్టుకున్నది. కార్యక్రమంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, సీఎంఆర్ చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డి , నియోజకవర్గంలోని వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.