తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ దశదిన కర్మ కార్యక్రమాన్ని హైదరాబాద్ హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాలులో ఆదివారం నిర్వహించారు.
సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్యెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, కళాకారులు పాల్గొని సాయిచంద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాయిచంద్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
– ఎల్బీనగర్/హయత్నగర్