Tree Collapse | హైదరాబాద్ : పాతబస్తీ శాలిబండ పోలీసు స్టేషన్ పరిధిలోని షంశీర్ గంజ్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే ఉన్న ఓ భారీ వృక్షం కుప్పకూలిపోయింది. ఆ చెట్టు ప్రధాన రహదారిపై విరిగి పడింది. దీంతో ఆ చెట్టు కింద పలు వాహనాలు ఇరుక్కుపోయాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆలోపే స్థానికులు చెట్టు కొమ్మలను తొలగించి గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చెట్టు కూలడంతో షంశీర్ గంజ్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు చెట్టును తొలగించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
రోడ్డుపై విరిగి పడ్డ భారీ చెట్టు.. 12 మందికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ – పాతబస్తీ శాలిబండ పిఎస్ పరిధి షంశీర్ గంజ్‌లో ఒక్కసారిగా భారీ చెట్టు కూలింది..
ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న 12 మందికి తీవ్రంగా గాయాలవగా.. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. pic.twitter.com/TPtYRfOT21
— Telugu Scribe (@TeluguScribe) July 22, 2024
ఇవి కూడా చదవండి..
Economic Survey | ఏటా 78 లక్షల ఉద్యోగాలు కల్పించాల్సిందే.. తేల్చి చెప్పిన ఆర్ధిక సర్వే..!
TG Weather | ఈ తెలంగాణ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు..