Economic Survey | ఏటా 78 లక్షల ఉద్యోగాలు కల్పించాల్సిందే.. తేల్చి చెప్పిన ఆర్ధిక సర్వే..!
Economic Survey | ప్రతిఏటా 78 లక్షల మందికి తప్పనిసరిగా ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే పేర్కొంది.
Economic Survey | ప్రతిఏటా 78 లక్షల మందికి తప్పనిసరిగా ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరం వృద్ధి, దేశంలో ఆర్థిక పరిస్థితి స్థితిగతులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ‘ఆర్థిక సర్వే’ను ప్రవేశ పెట్టారు. శ్రామికశక్తిని పెంపొందించడానికి వ్యవసాయేతర రంగంలో 2030 వరకూ ఏటా 78 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందేనని ఆర్థిక సర్వే తేల్చి చెప్పింది. వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగాలు కల్పించాల్సి ఉందని పేర్కొన్న ఆర్థిక సర్వే.. 2023-24లో వ్యవసాయ రంగంలో శ్రామిక శక్తి 45.8 శాతం ఉందని, 2047 నాటికి అందులో నాలుగోవంతుకు తీసుకు రావాలని ప్రతిపాదించింది.
‘మహిళలకు ఉపాధి కల్పించే వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలకు ఉన్న ప్రాధాన్యానికి అనుగుణంగా వ్యవసాయేతర రంగాల్లో ఏటా 78 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది’ అని ఆర్థిక సర్వే పేర్కొంది. తదనుగుణంగా గత ఐదేండ్లుగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్షియేటివ్ (పీఎల్ఐ) పథకాల ద్వారా 60 లక్షల మందికి, మిత్రా టెక్స్ టైల్ స్కీమ్, ముద్ర రుణాల ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొంది. కంపెనీల్లో ఫ్లెక్సీ వర్కర్ల నియామకం పెరుగుతున్నదని, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది.
‘దేశంలోని వివిధ కంపెనీల్లో సుమారు 54 లక్షల మంది ఫార్మల్ కాంట్రాక్ట్ స్టాఫ్ లేదా ఫ్లెక్సీ వర్కర్లు పని చేస్తున్నారు. వీరికి సకాలంలో వేతనాల చెల్లింపు, సామాజిక భద్రత, వైద్య బీమా వసతులు కల్పించాల్సిన బాధ్యత ఈ కంపెనీలపైనే ఉంది. కాంట్రాక్టు వర్కర్లకు పూర్తిగా సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత కంపెనీలదే. 2023లో సగటున కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాలు 75 శాతానికి పైగా పెరిగాయి’ అని ఆర్థిక సర్వే వెల్లడించింది.
ఇవి కూడా చదవండి :
Best Family Cars | రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ ఫ్యామిలీ కార్లివే.. !
Union Budget | 1947 నుంచి 2024 వరకూ బడ్జెట్లో మార్పులూ చేర్పులూ ఇలా..
Nothing Phone 2a Plus | 31న భారత్ మార్కెట్లో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Union Budget 2025 | కొలువుల కల్పనే కష్టం.. నిర్మలమ్మ ‘బడ్జెట్’ ముందు సవాళ్లివే..!
Union Budget 2024-25 | ఏడో బడ్జెట్తో ఆయన రికార్డుకు విత్త మంత్రి నిర్మలమ్మ బ్రేక్..?
Tata Punch | మారుతి సుజుకి స్విఫ్ట్ను బ్రేక్ చేసిన టాటా పంచ్.. టాప్ -10 బెస్ట్ కార్లివే..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

