Sudan | ఒకపూట కడుపు నింపుకోవాలన్నా.. సైనికుల లైంగిక వాంఛ తీర్చాల్సిందే.. ఇదీ సుడాన్ మహిళల దుర్భర దుస్థితి
Sudan | సైన్యం, పారామిలిటరీ మధ్య ఘర్షణతో ఆఫ్రికా దేశమైన సూడాన్ (Sudan)లో మహిళలు దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు.
Sudan | సైన్యం, పారామిలిటరీ మధ్య ఘర్షణతో ఆఫ్రికా దేశమైన సూడాన్ (Sudan)లో మహిళలు దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు. తినడానికి కూడా తిండిలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకపూట కడుపు నింపుకోవాలన్నా సైన్యం చేతిల్లో లైంగికంగా నలిగిపోవాల్సిన దుస్థితి. సైనికుల లైంగిక వాంఛలు తీరిస్తేనే వారికి ఆహారం దొరికే పరిస్థితి. మహిళలే స్వయంగా వారి గోడును ది గార్డియన్ ముందు వెళ్లబోసుకున్నారు.
సూడాన్‌లో గతేడాది శక్తిమంతమైన పారామిలిటరీ, సైన్యం మధ్య యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. ఈ యుద్ధం కారణంగా చాలా మంది ఆ దేశాన్ని వీడి వలసవెళ్లిపోయారు. ఇక సూడాన్‌లోని ఒమ్దుర్‌మన్ (Omdurman) పట్టణం కూడా చాలా వరకూ ఖాళీ అయిపోయింది. చాలా మంది అక్కడి నుంచి పారిపోగా.. డజనుకుపైగా మహిళలు వారి కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే చిక్కుకుపోయారు. ఇక అప్పటి నుంచి వారు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఇక్కడ ఆహారం మొత్తం సైన్యం చేతుల్లోనే ఉంటుంది. దీంతో ఆహారం కావాలంటే మహిళలు వారి లైంగిక వాంఛలు తీర్చాల్సిన పరిస్థితి.
ఆహారం మాత్రమే కాదు.. ఇతర వస్తువులు కావాలన్నా సరే వారి చేతుల్లో లైంగికంగా నలిగిపోవాల్సిందే. ‘నా తల్లిదండ్రులు ఇద్దరూ వృద్ధులు. అనారోగ్యంతో ఉన్నారు. నా కుమార్తెను బయటకు పంపలేను. వారిని పోషించేందుకు ఆహారం కావాలంటే నాకు ఉన్న మార్గం అదొక్కటే’ అంటూ ఓ బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ‘పిల్లల కడుపు నింపాలంటే.. ఇదొక్కటే మార్గం’ అని మరో మహిళ వాపోయింది.
ఇక కొందరు సైనికులు అక్కడున్న మహిళల్ని పాడుపడిన ఇళ్ల వద్దకు తీసుకొచ్చి వరుసగా నిల్చోబెట్టి ఎవరుకావాలో ఎంచుకుని మరీ ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దేశంలో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచీ అక్కడ ఇదే పరిస్థితి అని వాపోతున్నారు. అయితే, తాము ఏమీ చేయలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, సైన్యం, పారామిలిటరీ మధ్య గతేడాది ఏప్రిల్ 15న యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఆధిపత్య పోరులో అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. ఇప్పటి వరకూ ఈ యుద్ధం కారణంగా 150,000 మంది ప్రాణాలు కోల్పోగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
Also Read..
Mumbai Rains | ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. హై టైడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు
KH Muniyappa | కర్ణాటక మంత్రి అల్లుడి కోసం.. అసెంబ్లీలో మరో కార్యదర్శి కొలువు
August 15 Movies | ఆగస్టు 15న సినిమాల జాతర..! ఏమేం రిలీజు అవుతున్నాయంటే?
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Omdurman
- Sudan
- Sudan womens
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

