KH Muniyappa | కర్ణాటక మంత్రి అల్లుడి కోసం.. అసెంబ్లీలో మరో కార్యదర్శి కొలువు
KH Muniyappa | కర్ణాటక మంత్రి అల్లుడి కోసం ఆ రాష్ట్ర అసెంబ్లీలో కొత్తగా మరో కార్యదర్శి కొలువును సృష్టిస్తున్నారు. విధానసభ అసెంబ్లీ కార్యదర్శి పదవి ఇప్పటికే ఉండగా ‘సెక్రటరీ 2’ అనే కొత్త ఉద్యోగం కోసం స్పీకర్ కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన లేఖను అసెంబ్లీ ఆర్థిక శాఖకు స్పీకర్ పంపి ఆమోదం కోరారు.
బెంగళూరు: కర్ణాటక మంత్రి (KH Muniyappa) అల్లుడి కోసం ఆ రాష్ట్ర అసెంబ్లీలో కొత్తగా మరో కార్యదర్శి కొలువును సృష్టిస్తున్నారు. విధానసభ అసెంబ్లీ కార్యదర్శి పదవి ఇప్పటికే ఉండగా ‘సెక్రటరీ 2’ అనే కొత్త ఉద్యోగం కోసం స్పీకర్ కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన లేఖను అసెంబ్లీ ఆర్థిక శాఖకు స్పీకర్ పంపి ఆమోదం కోరారు. ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రి కేహెచ్ మునియప్ప అల్లుడు శశిధర్ జేఈ కోసం అసెంబ్లీలో రెండో కార్యదర్శి పదవిని సృష్టిస్తున్నట్లు తెలుస్తున్నది.
కాగా, కర్ణాటక విధానసభ అసెంబ్లీ ఎంప్లాయిస్ అసోసియేషన్ దీనిపై నిరసన వ్యక్తం చేసింది. మంత్రి కేహెచ్ మునియప్ప అల్లుడు శశిధర్‌కు స్థానం కల్పించేందుకు ‘సెక్రటరీ 2’ పేరుతో కొత్త పోస్టు సృష్టిస్తున్నారని ఆరోపించింది. కార్యదర్శి పదవిని శశిధర్ తీసుకోలేనందున కొత్త ఉద్యోగం కల్పిస్తున్నారని విమర్శించింది.
మరోవైపు ఎమ్మెల్యే ఎం రూపకళ భర్త అయిన శశిధర్ ప్రస్తుతం కంప్యూటర్ వింగ్‌లో ఉన్నారని అసెంబ్లీ ఉద్యోగుల సంఘం తెలిపింది. సాధారణంగా పదోన్నతి ద్వారా సెక్రటరీ పోస్టు పొందుతారని పేర్కొంది. కంప్యూటర్ వింగ్ ఉద్యోగులు ఎప్పుడూ కార్యదర్శులు కాలేరని విమర్శించింది. విధానసభ అసెంబ్లీ కార్యదర్శికి ఈ మేరకు లేఖ రాసింది.
కాగా, కర్ణాటక అసెంబ్లీ రూల్ బుక్ ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి ఉన్న అధికారాలు, హోదా వంటివి శాసనసభ కార్యదర్శికి కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో కేహెచ్ మునియప్ప అల్లుడు శశిధర్ కోసం అసెంబ్లీలో కొత్తగా ‘సెక్రటరీ 2’ కొలువు సృష్టించడంపై ఆ రాష్ట్ర బీజేపీ మండిపడింది. ఎమ్మెల్యేల తిరుగుబాటును అణిచివేసేందుకు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి 90 కేబినెట్ గ్రేడ్ హోదాలను సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం ఇప్పటికే సృష్టించిందని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్ అశోకా ఆరోపించారు. తాజాగా మంత్రి అల్లుడికి కొత్త పదవి కల్పిస్తున్నారని ఎక్స్ పోస్ట్‌లో విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

