August 15 Movies | ఆగస్టు 15న సినిమాల జాతర..! ఏమేం రిలీజు అవుతున్నాయంటే?
ఆగస్టు 15న పుష్ప-2 ది రూల్ పేరు మీదున్న స్లాట్ ఖాళీ అవ్వడంతో అదే డేట్‌న ఐదు సినిమాలు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు.
కల్కి 2898 ఏడి సినిమా విడుదలకు ముందు థియేటర్లో జనాలు లేక వెలవెలపోయాయి. సింగిల్ స్క్రీన్స్ కొన్ని చోట్ల మూతపడ్డాయి. కల్కి 2898 ఏడి విడుదల తరువాత ఆడియన్స్ థియేటర్ బాట పట్టారు. థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడిపోయాయి. ఇక సినిమాలకు ఊపు వచ్చింది. అందుకే వరుసగా సినిమాలు విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఈ ఆగస్టు 15న ఐదు సినిమాలు విడుదల కాబోతున్నాయి.
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌గా రూపొందుతున్న పుష్ప-2 ది రూల్‌ను ముందుగా ఆగస్టు 15న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇంకా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ వుండటంతో ఈ చిత్రాన్ని ఇటీవలే డిసెంబరు 6కు వాయిదా వేశారు. అయితే అప్పటి వరకు ఆగస్టు 15న పుష్ప-2 ది రూల్ పేరు మీదున్న స్లాట్ ఖాళీ అవ్వడంతో అదే డేట్‌న ఐదు సినిమాలు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు.
అందులో రామ్ హీరోగా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఒకటి. పూరి జగన్నాథ్ దర్శకత్వలో గత ఏడాది వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్ ఇది. దీంతో పాటు విక్రమ్ నటించిన తంగలాన్‌తో పాటు, రవితేజ హీరోగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ కూడా వుంది. ఇక మిగిలినవి రెండు చిన్న సినిమాలు. 35 అనే టైటిల్‌తో రాబోతున్న సినిమాతో పాటు గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఆయ్ కూడా ఈ డేట్‌నే ప్రకటించారు. ఆయ్ సినిమాలో ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నే హీరోగా నటిస్తున్నారు.
అయితే ఈ ఐదు సినిమాల్లో మూడు క్రేజీ సినిమాలు వుండటంతో.. ఆయ్ నిర్మాత బన్నీవాసు తాజాగా డేట్ మారుద్డామనే ఆలోచనలో వున్నట్లు సమాచారం. అంతేకాదు మిస్టర్ బచ్చన్ షూటింగ్ కూడా బ్యాలెన్స్ వుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్‌ను పూర్తిచేసి ఆగస్టు 15 డేట్ అడ్వాంటేజ్ వినియోగించుకోవాలని చూస్తున్నారు నిర్మాతలు. సో.. ఆగస్గు 15న జరిగే సినిమాల జాతర కోసం సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు.
Also Read :
Dhanush – Jr NTR | ఎన్టీఆర్‌తో కలిసి మల్టీ స్టారర్ చేయాలని ఉంది : ధనుష్
Bhaiyya Ji | ఓటీటీలోకి మనోజ్ బాజ్‌పాయ్ ‘భయ్యాజీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Game Changer | అల్లు అర్జున్‌తో పోటీ పడనున్న రామ్ చరణ్.. క్రిస్మస్ బరిలో ‘గేమ్ ఛేంజర్’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

