Bhaiyya Ji | బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘భయ్యాజీ’ (Bhaiyaaji). ఈ సినిమాకు ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై (Sirf Ek Bandaa Kaafi Hai)’ ఫేమ్ అపూర్వ సింగ్ కర్కి (Apoorv Singh Karki) దర్శకత్వం వహించగా.. సువీందర్ విక్కీ, జతిన్ గోస్వామి, విపిన్ శర్మ, జోయా హుస్సేన్ కీలక పాత్రల్లో నటించారు. మనోజ్ బాజ్‌పాయి కెరీర్లో 100వ చిత్రంగా వచ్చిన ఈ మూవీ మే 24న ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వలేదనిపించింది. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో ఈ సినిమా జూలై 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాగ.. లోకల్ డాన్‌గా మనోజ్ ఇందులో కనిపించాడు భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్, SSO ప్రొడక్షన్స్ & ఔరేగా స్టూడియోస్ బ్యానర్లపై వినోద్ భన్సాలి, కమలేష్ భన్సాలి, విశాల్ గుర్నాని, అసిఫ్ షేక్, మనోజ్ బాజ్‌పాయి ఈ సినిమాను నిర్మించారు.
Hindi film #BhaiyyaJi will premiere on @ZEE5Premium on July 26th. pic.twitter.com/cmDXtSaThT
— Moviedeed (@moviedeed) July 22, 2024
Also Read..