Gautam Gambhir: కోహ్లీతో రిలేషన్ టీఆర్పీల కోసం కాదు: గౌతం గంభీర్
Gautam Gambhir: గంభీర్, కోహీ మధ్య ఫ్రెండ్షిప్ చెడిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో పలుమార్లు ఆ ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఇప్పుడు శ్రీలంక టూర్‌కు కోచ్‌గా గంభీర్ వ్యవహరించనున్నారు. అయితే కోహ్లీతో తనకు ఎటువంటి విభేదం లేదని, తమది టీఆర్పీ రిలేషన్ కాదు అని గంభీర్ పేర్కొన్నాడు.
ముంబై: టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీతో నెలకొన్న వివాదాలపై భారత చీఫ్ కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) పెదవి విప్పారు. కోహ్లీతో ఉన్న రిలేషన్ ఇద్దరు వ్యక్తల మధ్య ఉండేదే అని, అది టీఆర్పీల కోసం కాదు అని గంభీర్ అన్నారు. టీమిండియా శ్రీలంక టూర్‌కు వెళ్తున్న నేపథ్యంలో ఇవాళ ముంబైలో చీఫ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో కోహ్లీ గురించి అడిగిన ప్రశ్నకు గంభీర్ బదులిచ్చారు. టెలివిజన్ రేటింగ్స్ గురించి ఏదైనా అనడం బాగానే ఉంటుందని, కానీ కోహ్లీతో తనకు ఎటువంటి విభేదం లేదని, ఇద్దరు పరిణితి చెందిన వ్యక్తుల మధ్య ఉండే రిలేషనే తమ మధ్య ఉన్నట్లు గంభీర్ వెల్లడించాడు. ఈ విషయాన్ని ఎన్నో సార్లు చెప్పినట్లు తెలిపాడు.
స్వంత జట్టు . స్వంత జెర్సీ కోసం పోరాడం హక్కు ప్రతి ప్లేయర్‌కు ఉంటుందని, విజయం సాధించి డ్రెస్సింగ్ రూమ్‌లో అడుగుపెట్టాలని ఆలోచన ఉంటుందన్నారు. కానీ 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని, దేశాన్ని గర్వంగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నామని, అలాంటప్పుడు ఒకే రకంగా ఉంటామన్నారు. ఫీల్డ్‌లో కోహ్లీతో మంచి రిలేషన్ ఉందని, అదే రిలేషన్ కొనసాగుతుందన్నాడు. కోహ్లీ ఓ ప్రొఫెషనల్ అని, వరల్డ్‌క్లాస్ అథ్లెట్ అని, ప్లేయర్‌గా అతన్ని అత్యంత గౌరవిస్తానని, ఆ మర్యాదనే కొనసాగిస్తానని, కలిసి జట్టు కోసం పనిచేయనున్నట్లు గంభీర్ తెలిపాడు.
Mumbai | Indian Men’s Cricket Team Head Coach Gautam Gambhir says, “It’s good for the TRP but what kind of relationship I do share with Virat Kohli, I think it’s between two mature individuals. I’ve said it many times, everyone has the right to fight for their own team, for their… pic.twitter.com/x8QI8KbyLF
— ANI (@ANI) July 22, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

