BCCI : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27ను సిరీస్ సమంతో ఆరంభించిన భారత్ అనూహ్యంగా తడబడుతోంది. స్వదేశంలో వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేసిన శుభ్‌మన్ గిల్ సేన.. దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది. రెండు మ్యాచుల్లో ఓటమితో కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)ను తప్పించాలనే డిమాండ్లు వచ్చాయి. ప్రయోగాల పేరుతో భారత టెస్టు క్రికెట్‌ను నాశనం చేస్తున్న గౌతీ బదులు సుదీర్ఘ ఫార్మాట్లో అనుభవజ్ఞుడైన వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman)కు బాధ్యతలు అప్పగిస్తారని కథనాలు వస్తున్నాయి. సఫారీల దెబ్బకు రెండు టెస్టుల్లో ఓడిన తర్వాత బీసీసీఐ పెద్దలు మాజీ సొగసరి బ్యాటర్‌ను సంప్రదించారని సమాచారం.
సొంతగడ్డపై సింహంలా గర్జించే భారత జట్టు గంభీర్ కోచింగ్‌లో విఫలమవుతోంది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌ను మరుకవ ముందే దక్షిణాఫ్రికా 2-0తో సిరీస్ కొల్లగొట్టింది. ఒకప్పుడు అజేయ శక్తిగా దూసుకెళ్లిన టీమిండియాను గంభీర్ పరాజయాల తోవ తొక్కిండానే విమర్శలు వచ్చాయి. దాంతో.. గౌతీని వైట్బాల్కే పరిమితం చేసి టెస్టులకు కొత్త కోచ్ ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మాజీ టెస్టు స్పెషలిస్ట్ లక్ష్మణ్‌ను బీసీసీఐ సంప్రదించిందని టాక్.
The BCCI has reportedly made an informal approach to VVS Laxman to explore the possibility of taking up a coaching role with the national Test team, following India’s 2-0 whitewash in the recent home Test series against South Africa under Gautam Gambhir.https://t.co/crXcmRswkX
— Circle of Cricket (@circleofcricket) December 27, 2025
అయితే.. అతడు మాత్రం బెంగళూరలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(CoE)కు హెడ్‌గా ఉండేందుకే ఇష్ట పడుతున్నాట. అయినా సరే వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శనను బట్టి గంభీర్‌ను కొనసాగించాలా? వద్దా? అనే నిర్ణయానికి వస్తామని బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
‘ప్రస్తుతం గంభీర్‌కు అన్నివిధాల మద్దతు లభిస్తోంది. కోచ్‌గా అతడి కాంట్రాక్ట్ 2027 వన్డే ప్రపంచకప్ వరకూ ఉంది. అయితే.. వచ్చే టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా నిలబెట్టుకున్నా.. ఫైనల్ చేరినా గంభీర్‌కు ఢోకా లేదు. అలా జరగలేదంటే గంభీర్ కోచింగ్ కాంట్రాక్ట్‌ను సమీక్షించే అవకాశముంది. టెస్ట్ కోచ్‌గా గౌతీ కొనసాగుతాడా? లేదా? అనేది ఆసక్తికరం. ఎందుకంటే… లక్ష్మణ్ సహా కొందరు ఆసక్తి చూపకపోవడంతోనే అతడు రెడ్ బాల్ కోచ్‌గా ఇంకా ఉన్నాడు’ అని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాతో బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
🚨Team India Big Update🚨
As per certain reports, someone from the BCCI had informally approached VVS Laxman to check if he would be interested in becoming the Test head coach. pic.twitter.com/G5V9DSnzwv
— Cricnow (@CricketNew73688) December 27, 2025