కారేపల్లి, డిసెంబర్ 27: మండల కేంద్రమైన కారేపల్లిలోని మద్యం దుకాణాన్ని సింగరేణి ఎక్సైజ్ ఎస్సై బీ వసంత శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ తనిఖీల్లో భాగంగా మద్యం దుకాణాలలో క్రయవిక్రయాలతో పాటు మద్యం శాంపిల్స్‌ను పరిశీలించామని ఆమె చెప్పారు.
గ్రామాల్లోని బెల్ట్ షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన కొన్ని మద్యం సీసాలను ఎస్సై వసంత బృందం స్వాధీనం చేసుకుంది. గ్రామాల్లోని బెల్ట్ షాపుల్లో తనిఖీలు చేయగా అక్రమంగా నిల్వ ఉంచిన మధ్యం పట్టుబడింది. వెంటనే విచారణ నిర్వహించి బాధ్యులపై కేసు నమోదు చేస్తాం. మద్యం దుకాణాలలో నిబంధనలకు అనుగుణంగానే విక్రయాలు జరపాలి అని ఎస్సై వసంత నిర్వాహకులకు సూచించారు.