Game Changer | అల్లు అర్జున్‌తో పోటీ పడనున్న రామ్ చరణ్.. క్రిస్మస్ బరిలో ‘గేమ్ ఛేంజర్’
Game Changer | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో గేమ్‌ఛేంజర్ (Game changer) ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan), తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో ఈ సినిమా రానుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
Game Changer | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో గేమ్‌ఛేంజర్ (Game changer) ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan), తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో ఈ సినిమా రానుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు.
రీసెంట్గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమా విడుదల ఎప్పుడు అని రామ్ చరణ్ అభిమానులతో పాటు మూవీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరికి గుడ్ న్యూస్ తెలుపుతూ.. నిర్మాత దిల్ రాజ్ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం రాయన్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గోన్న దిల్ రాజ్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ విడుదల తేదీపై అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాను డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా తీసుకురాబోతున్నట్లు ప్రకటించాడు. అయితే అదే రోజు అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 చిత్రం కూడా విడుదల కాబోతుంది. దీంతో ఇద్దరు మెగా హీరోల మధ్య క్లాష్ ఏర్పడనున్నట్లు తెలుస్తుంది.
#GameChanger 🔥🔥🔥 pic.twitter.com/A3QkMaLcxJ
— Sri Venkateswara Creations (@SVC_official) July 21, 2024
ఇక ఈ మూవీలో సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్లర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరాయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Also Read..
- Governor Abdul Nazeer | రాజధాని హైదరాబాద్‌ను కోల్పోయాం.. రాష్ట్ర విభజనతో ఏపీకి తీవ్ర నష్టం: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్
- Modern Masters : S.S RAjamouli | రాజమౌళిపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. ట్రైలర్ చూశారా.!
- PM Modi | అమృత్‌కాల్‌కు ముఖ్యమైన బడ్జెట్ ఇది : ప్రధాని మోదీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

