Modern Masters : S.S RAjamouli | రాజమౌళిపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. ట్రైలర్ చూశారా.!
Modern Masters : S.S RAjamouli | టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Modern Masters : S.S RAjamouli | టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మాడర్న్ మాస్టర్స్ ఎస్.ఎస్ రాజమౌళి (Modern Masters: S.S. Rajamouli)పేరిటా ఈ డాక్యుమెంటరీ వస్తుండగా.. ఈ చిత్రాన్ని ఆగష్టు 02 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే స్ట్రీమింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.
మీకు ఒక అద్భుతమైన కథ చెబుతాను. సినిమాపై ప్రజలు పెట్టుబడి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అంటూ ట్రైలర్ మొదలవుతుంది. ఇక టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్‌తో పాటు హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరున్ బాలీవడ్ నిర్మాత కరణ్ జోహర్ తదితరులు రాజమౌళి వర్క్ గురించి చెబుతూ ఈ ట్రైలర్ కట్ సాగింది. ముఖ్యంగా రాజమౌళి టేకింగ్ ట్రైలర్‌కే హైలైట్‌గా చెప్పుకోవచ్చు. సినిమా అంటే పిచ్చి ఉన్నావారికి ఈ డాక్యుమెంటరీ పండుగ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ ట్రైలర్‌ను మీరు చూసేయండి.
ఎస్.ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన స్టూడెంట్ నం1 సినిమాతో మెగాఫోన్ పట్టిన ఇతను మొదటి మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం అనంతరం ఎన్టీఆర్తోనే మళ్లీ సింహాద్రి అంటూ సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. 2015లో వచ్చిన బాహుబలి సినిమాతో రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. ఇక బాహుబలి 2 సినిమా అయితే ఏకంగా రూ.2000 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. ఈ చిత్రం అనంతరం ఆర్ఆర్ఆర్ వంటూ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా ఆస్కార్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించారు.
Also Read..
- PM Modi | అమృత్‌కాల్‌కు ముఖ్యమైన బడ్జెట్ ఇది : ప్రధాని మోదీ
- Prabhas Fauji | ఇండో-పాక్ లవ్ స్టోరీ.. ప్రభాస్‌తో రొమాన్స్ చేయనున్న పాకిస్థాన్ బ్యూటీ.?
- Budget Sessions | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

