Prabhas Fauji | ఇండో-పాక్ లవ్ స్టోరీ.. ప్రభాస్‌తో రొమాన్స్ చేయనున్న పాకిస్థాన్ బ్యూటీ.?
Prabhas Fauji | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పడి పడి లేచే మనసు, సీతారామం, అందాల రాక్షసి చిత్రాల ఫేమ్ హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ నిర్మించనుంది.
Prabhas Fauji | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పడి పడి లేచే మనసు, సీతారామం, అందాల రాక్షసి చిత్రాల ఫేమ్ హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ నిర్మించనుంది. అయితే ఈ సినిమా అక్టోబర్‌లో షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ కాంబోలో వస్తున్న చిత్రం ‘స్పిరిట్’ ప్రీ ప్రోడక్షన్ పనులు ఆలస్యం అవుతుండడంతో ఆ స్థానంలో ‘ఫౌజీ’ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌కు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమా కోసం పాన్ సియా నటిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హీరోయిన్ సజల్ అలీని చిత్రయూనిట్ సంప్రదిస్తున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సజల్ అలీ ఇంతకుముందు బాలీవుడ్ దివంగత నటి శ్రీదేవితో కలిసి మామ్ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్లో చేయలేదు.
మరోవైపు ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ అమ్మాయిని పెడుతున్నాడు. హను లవ్ స్టోరీ ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడా అని అభిమానులు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో రాబోతున్నట్లు తెలుస్తుంది. అప్పుడు ఇండియా పాకిస్థాన్ కలిసి ఉండేవి కాబట్టి ఆ నేపథ్యంలో హను రాఘవపూడి కథ రాసుకున్నట్లు సమాచారం. కాగా ఈ ప్రాజెక్ట్ సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ అనుకుంటునట్టు తెలుస్తున్నది. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారట. అందుకే ఈ టైటిల్ బావుంటుందని బృందం భావిస్తున్నది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో రానుండగా బ్రిటీష్‌వారి సైనికుడిగా ఇందులో ప్రభాస్ కనిపించనున్నారట. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు బాణీలు సమకూరుస్తున్నారు.
Also Read..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

