PM Modi | నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ( Budget Sessions) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత బడ్జెట్‌ను అమృత్ కాలానికి (Amrit Kaal) చెందిన బడ్జెట్‌గా మోదీ అభివర్ణించారు. 2047 నాటికి వికసిత్ భారత్ పూర్తి చేసే బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామన్నారు. తమ ప్రభుత్వం దేశం కోసం పోరాడుతోందని చెప్పారు. ఐదేళ్లు ప్రగతి కోసం పోరాడాలని, తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఆలోచించాలని కూటమి నేతలకు ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. అదేవిధంగా గత చేతు అనుభవాలను పక్కనపెట్టి దేశాభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ప్రతిపక్షాలను మోదీ కోరారు.
‘పార్టీలకతీతంగా సభ్యులు వ్యవహరించాలి. దేశానికి తమను తాము అంకితం చేసుకోవాలి. గౌరవప్రదమైన ఈ పార్లమెంట్ వేదికను ఎంపీలంతా ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను. ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారం చేపట్టింది. 60 ఏళ్ల తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మాది. దేశానికి దిశానిర్దేశం చేసేలా కేంద్ర బడ్జెట్ ఉంటుంది. ఈ బడ్జెట్ అమృత్‌కాల్‌కు ముఖ్యమైన బడ్జెట్. ఈ బడ్జెట్ మా ప్రభుత్వ లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ప్రజలు మాపై నమ్మకం ఉంచి మూడోసారి గెలిపించారు. వారి నమ్మకాన్ని నిలబెడతాం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తాం. 2047 నాటికి మన కలల వికసిత్ భారత్‌కు ఈ బడ్జెట్ బలమైన పునాది అవుతుంది’ అని మోదీ తెలిపారు.
Also Read..
Budget Sessions | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
Jammu Kashmir | ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడి.. రాజౌరీలో కొనసాగుతున్న ఎన్కౌంటర్
Geoffrey Boycott | ఆసుపత్రిలో చేరిన ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్.. పరిస్థితి విషమం