Jammu Kashmir | ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడి.. రాజౌరీలో కొనసాగుతున్న ఎన్కౌంటర్
జమ్ముకశ్మీర్‌లో (Jammu Kashmir) ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. భారత సైన్యంపై వరుగా దాడులకు పాల్పడుతున్నారు. సోమవారం ఉదయం రాజౌరీ జిల్లా గుంధ్వఖవాస్ ప్రాంతంలో సెక్యూరిటీ పోస్టుపై కాల్పులకు తెగబడ్డారు. అయితే ఉగ్ర దాడిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో (Jammu Kashmir) ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. భారత సైన్యంపై వరుగా దాడులకు పాల్పడుతున్నారు. సోమవారం ఉదయం రాజౌరీ జిల్లా గుంధ్వఖవాస్ ప్రాంతంలో సెక్యూరిటీ పోస్టుపై కాల్పులకు తెగబడ్డారు. అయితే ఉగ్ర దాడిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. అంతేకాకుండా ఉగ్రవాదుల ఏరివేత కోసం భారీస్థాయిలో ఆపరేషన్ చెపట్టింది. అయితే టెర్రరిస్టుల కాల్పుల్లో ఓ జవాన్ గాయపడ్డారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులను సమీక్షించిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.
కాగా, రాజౌరీలోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు ప్లాన్ చేసిన భారీ స్థాయి దాడిని సైన్యం తిప్పుకొట్టిందని సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ సునీల్ భర్త్వాల్ తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ దాడి సోమవారం ఉదయం 4 గంటలకు జరిగినట్లు వెల్లడించారు.
ఈ నెల 19న కశ్మీర్‌లోని కెరన్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఇక గత గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో దోడా జిల్లాలో జడ్డన్ బాటా గ్రామంలోని తాత్కాలిక సైనిక క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ జవాను తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెలలో కథువా జిల్లాలోని మచేడీ అటవీ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. మరో ఐదుగురు గాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

