Governor Abdul Nazeer | రాజధాని హైదరాబాద్‌ను కోల్పోయాం.. రాష్ట్ర విభజనతో ఏపీకి తీవ్ర నష్టం: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అశాస్త్రీయంగా విడదీశారని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Naseer) అన్నారు. భాగస్వాములతో చర్చలు చేయకుండా విభజించారని చెప్పారు. ఉమ్మడి ఏపీ విభజన రాష్ట్ర ప్రజల హృదయాల్లో మాయని మచ్చగా మిగిలిందని తెలిపారు.
అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అశాస్త్రీయంగా విడదీశారని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazeer) అన్నారు. భాగస్వాములతో చర్చలు చేయకుండా విభజించారని చెప్పారు. ఉమ్మడి ఏపీ విభజన రాష్ట్ర ప్రజల హృదయాల్లో మాయని మచ్చగా మిగిలిందని తెలిపారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ వల్ల అల్లకల్లోలం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రజలు సుదీర్ఘకాలం అభివృద్ధి, పురోగతికి నోచుకేలదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి నష్టం ఏర్పడిందన్నారు. రాజధాని హైదరాబాద్‌ను కోల్పోయామని చెప్పారు. తద్వారా ఆర్థిక నష్టం జరిగిందన్నారు.
‘కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. 2014లో ఏపీ అభివృద్ధికి చంద్రబాబు తీవ్రంగా కృషి చేశారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగింది. అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయి. చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడిదారులు వెనక్కి మళ్లారు. 2019-2024 మధ్య కాలంలో రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లింది.
విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తగినంత పరిహారం ఇవ్వలేదు. ఆస్తులు, అప్పుల పంపిణీలో అసమానతలు ఉన్నాయి. అశాస్త్రీయ విభజన వల్ల 46 శాతం వనరులు మాత్రమే వారసత్వంగా వచ్చాయి. రాజధాని హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల ఆర్థిక నష్టం జరిగింది. భారీ రెవెన్యూ లోటు వారసత్వంగా వచ్చింది. ప్రాంతం ఆధారంగా ఆస్తులు.. వినియోగం ఆధారంగా విద్యుత్ పంపిణీ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా విద్యాసంస్థలు విభజించారు. ఉన్నత విద్యాసంస్థలు కోల్పోయాం.
ఉమ్మడి ఏపీలో తలసరి ఆదాయం లక్షా 6 వేల 176 కోట్లు. విభజిత ఏపీలో తలసరి ఆదాయం 93 వేల 121 కోట్లకు పడిపోయింది. రాష్ట్ర విభజన వల్ల ప్రతికూల ప్రభావం పడింది. అపరిష్కృత సమస్యల వల్ల సవాళ్లు వచ్చాయి. విభజన వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని చంద్రబాబు ప్రభుత్వం అవకాశంగా మలచుకుంది సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ప్రభుత్వం పునాది వేసింది. సముద్ర తీరం, నౌకాశ్రయ ఆధారిత అభివృద్ధిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది. తయారీ కార్యకలాపాలకు అవసరమైన వాతావరణంపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది. 2014-19 మధ్య కాలంలో అభివృద్ధి, సంక్షేమం మధ్య స్పష్టమైన సమతుల్యం ఉంది.
గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో పట్టిసీమ రికార్డు సమయంలో పూర్తయింది. ఏడాది సమయంలోనే చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమ పూర్తిచేసింది. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తయింది. ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. కరవు నివారణ చర్యలు, రియల్‌టైమ్ గవర్నెన్స్ చేపట్టారు. భూసేకరణ ద్వారా అమరావతి ప్రాంత అభివృద్ధి చేశారు. కొత్త సచివాలయం, శాసనసభ భవన నిర్మాణం చేశారు. చంద్రబాబు దూరదృష్టి నాయకత్వం వల్లే 2014-19 మధ్య అభివృద్ధి సాధ్యమైంది.’ అంటూ గవర్నర్ తన ప్రసంగాన్ని ముంగించారు.
అయితే గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో వెనకబడిపోయిందన్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. హత్యా రాజకీయాలు నశించాలి.. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. అయినా గవర్నర్ ప్రసంగం కొనసాగడంతో.. నిరసగా విపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా, గవర్నర్ ప్రసంగం ద్వారా తెలంగాణపై తన దుర్భుద్ధిని చంద్రబాబు మరోసారి బయటపెట్టుకున్నారని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తన అభిప్రాయాలను గవర్నర్ ద్వారా చెప్పించారని విమర్శిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

