Dhanush – Jr NTR | ఎన్టీఆర్‌తో కలిసి మల్టీ స్టారర్ చేయాలని ఉంది : ధనుష్
Raayan Movie | తమిళ నటుడు ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం రాయన్ (Raayan). సందీప్ కిషన్, మలయాళం నటుడు కాళిదాస్ జయరాం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్లు విడుదల చేయగా.. ఆకట్టుకున్నాయి.
Raayan Movie | తమిళ నటుడు ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం రాయన్ (Raayan). సందీప్ కిషన్, మలయాళం నటుడు కాళిదాస్ జయరాం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్లు విడుదల చేయగా.. ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాను జూలై 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. విడుదల తేదీ దగ్గరపడటంతో ఆదివారం హైదరాబాద్‌లో భారీ ఎత్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా వేడుకలో ధనుశ్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.
యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. టాలీవుడ్లో తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అని వెల్లడించారు. ‘ఐ లవ్ సినిమా, ఐ లవ్ పవన్ కళ్యాణ్ సర్’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక ధనుశ్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఆడిటోరియం అంతా దద్దరిల్లిపోయింది. అనంతరం యాంకర్ ‘ఒకవేళ మల్టీ స్టారర్ చేయాలంటే ఎవరితో చేస్తారు? సూపర్ స్టార్ మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్. వీరిలో ఎవరితో చేస్తారు? అని అడుగుతుంది. దీనికి రిప్లయ్ ఇస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ అని సమాధానం ఇచ్చారు ధనుశ్. ఇక ఆన్సర్ చెప్పడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
I love cinema and I love Pawan Kalyan Sir From Tollywood, says Dhanush for the question ‘Favorite Hero From Tollywood?’ pic.twitter.com/sXpVrW8WNm
— Aakashavaani (@TheAakashavaani) July 21, 2024
ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. అతనో సాధారణ వ్యక్తి. మద్రాస్‌లోని ఓ హోటల్లో చెఫ్‌గా పనిచేస్తుంటాడు. కానీ అతని గతం మాత్రం పగతో రగిలిపోతుంటుంది. ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం ఎదురుచూస్తుంటాడు. ఇంతకి ఆ వ్యక్తి ప్రతీకారం ఎవరి మీద? పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ అయిన అతను హోటల్లో చెఫ్‌గా ఎందుకు పనిచేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ‘రాయన్’ సినిమా చూడాల్సిందే అని చెబుతోంది చిత్ర బృందం.
ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, విష్ణువిశాల్, దుషారా విజయన్, సెల్వ రాఘవన్, ఎస్జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరా అనే సినిమా చేస్తున్నాడు.
Also Read..
- Bhaiyya Ji | ఓటీటీలోకి మనోజ్ బాజ్‌పాయ్ ‘భయ్యాజీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
- Kamala Harris: 85 నిమిషాల పాటు దేశాధ్యక్షురాలి బాధ్యతలు నిర్వర్తించిన కమలా హ్యారిస్
- YS Jagan | పోస్టర్లు గుంజుకుని చించే హక్కు ఎవరిచ్చారు?.. ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసులపై వైసీపీ చీఫ్ జగన్ ఆగ్రహం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

