Prabhas | రాజా సాబ్ క్లైమాక్స్‌పై ప్రభాస్ కీలక కామెంట్స్.. మూవీపై పెరిగిన అంచనాలు
Prabhas | ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ హారర్ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ కూకట్‌పల్లిలోని కైతలాపూర్ గ్రౌండ్లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర బృందం మొత్తం హాజరవగా, చాలా రోజుల తర్వాత ప్రభాస్ అభిమానుల ముందుకు రావడంతో భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఈవెంట్‌కు తరలివచ్చారు.
Prabhas | ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ హారర్ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ కూకట్‌పల్లిలోని కైతలాపూర్ గ్రౌండ్లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర బృందం మొత్తం హాజరవగా, చాలా రోజుల తర్వాత ప్రభాస్ అభిమానుల ముందుకు రావడంతో భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఈవెంట్‌కు తరలివచ్చారు. వేదికంతా అభిమానుల ఉత్సాహంతో మార్మోగింది. ఈ ఈవెంట్లో ప్రభాస్ కనిపించిన న్యూ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గుబురు గడ్డం, పిలక జుట్టుతో స్టైలిష్‌గా కనిపించిన ప్రభాస్ ఎంట్రీతో అభిమానులు జోరుగా కేకలు వేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. వేదికపై మాట్లాడిన ప్రభాస్, సినిమా క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ది రాజాసాబ్ క్లైమాక్స్ చూసి నేను ఆశ్చర్యపోయాను. నాకు మాటలు రావడం లేదు. సినిమా ఎలా ఉందో ప్రేక్షకులే తేల్చాలి. కానీ నాకు మాత్రం క్లైమాక్స్ చాలా గొప్పగా అనిపించింది. మారుతి డార్లింగ్.. ఈ క్లైమాక్స్‌ను పెన్‌తో రాశావా లేక గన్‌తో రాశావా?” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు అభిమానులను మరింత ఉత్సాహపరిచాయి.అలాగే సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతున్న అన్ని సినిమాలకు ప్రభాస్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నాను. మన సినిమా కూడా హిట్ అయితే ఇంకా ఆనందం. నేను ఎప్పుడూ సీనియర్లను గౌరవిస్తాను, వాళ్ల నుంచి చాలా నేర్చుకున్నాను. రేపు ట్రైలర్ విడుదల అవుతుంది. సినిమా ఎంత పెద్ద స్థాయిలో ఉందో ట్రైలర్లోనే తెలుస్తుంది” అని అన్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ది రాజాసాబ్’ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం పెంచుకుంటున్న పిలక జుట్టు ఆయన తదుపరి చిత్రం ‘స్పిరిట్’ కోసమేనని అభిమానులు భావిస్తున్నారు. మొత్తంగా ప్రీ రిలీఈవెంట్తో పాటు ప్రభాస్ కామెంట్స్, న్యూ లుక్ కారణంగా ‘ది రాజాసాబ్’ పై అంచనాలు రోజురోజుకీ మరింత పెరుగుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

