Akhil Raj-Anupama | అఖిల్ రాజ్.. పేరు వినగానే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు కానీ, రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో రాజు పాత్ర అంటే మాత్రం ప్రేక్షకులు వెంటనే గుర్తుపట్టేస్తారు. ఆ సినిమాలో ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సహజమైన నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ యువ హీరో, తన నటనా సత్తాను చాటాడు. అంతకుముందే పలు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి అనుభవం సంపాదించిన అఖిల్ రాజ్‌కు రాజు వెడ్స్ రాంబాయితోనే బ్రేక్ వచ్చిందని చెప్పాలి. ఇక తాజాగా విడుదలైన ఈషా సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు అఖిల్ రాజ్. ఈ వరుస విజయాలతో ఇప్పుడు అతడికి అవకాశాలు క్యూ కడుతున్నాయనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం అఖిల్ రాజ్ ఓ క్రేజీ ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఒకటి తెరకెక్కించనున్న కొత్త సినిమాలో అతడు హీరోగా నటించనున్నాడట. ఇందులో మరో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే.. స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించనుందనే వార్త. కెరీర్ ఆరంభ దశలోనే అనుపమ లాంటి క్రేజీ హీరోయిన్‌తో నటించే అవకాశం రావడం అఖిల్ రాజ్‌కు పెద్ద అడ్వాంటేజ్‌గా మారనుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాను ప్యూర్ ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించనున్నట్లు సమాచారం. దర్శకుడు ఎవరన్నది ఇంకా అధికారికంగా వెల్లడించకపోయినా, కథకు మాత్రం అఖిల్ రాజ్ ఇప్పటికే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని టాక్ నడుస్తోంది.
అన్ని అనుకున్నట్లు జరిగితే, త్వరలోనే షూటింగ్ ప్రారంభమై వచ్చే ఏడాది సమ్మర్లో సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ సినిమా హిట్ అయితే, టాలీవుడ్‌కు మరో క్రేజీ యంగ్ హీరో రెడీ అయినట్టేనని అభిమానులు విశ్వసిస్తున్నారు.అయితే ఇప్పటికే అఖిల్ రాజ్ ఆచితూచి ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. మనోడికి మంచి భవిష్యత్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.