Kamala Harris: 85 నిమిషాల పాటు దేశాధ్యక్షురాలి బాధ్యతలు నిర్వర్తించిన కమలా హ్యారిస్
Kamala Harris : అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ గతంలో దేశాధ్యక్ష అధికారాలను నిర్వర్తించారు. జో బైడెన్‌కు కొలనోస్కోపీ సర్జరీ జరిగిన సమయంలో సుమారు 85 నిమిషాల పాటు దేశాధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. ప్రస్తుతం డెమోక్రటిక్ అభ్యర్థిగా రేసు నుంచి తప్పుకున్న బైడెన్.. ఆ స్థానంలో కమలా హ్యారిస్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.
న్యూయార్క్: రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో.. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్(Kamala Harris )ను అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవేళ కమలా హ్యారిస్ .. డెమోక్రటిక్ నామినేషన్ గెలిచి, ఆ తర్వాత నవంబర్‌లో జరిగే దేశాధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే, అమెరికాలో అధికారం చేపట్టిన తొలి మహిళా అధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ చరిత్రలో నిలవనున్నారు. కానీ ఆమె అధ్యక్ష అధికారాలను గతంలోనే నిర్వర్తించారు. 2021లో అధ్యక్షుడు జో బైడెన్ అనారోగ్యానికి లోనయ్యారు. ఆయనకు కొలనోస్కోపీ చేశారు. అప్పుడు ఆయనకు అనస్తీయా ఇచ్చారు. అయితే ఆ సమయంలో కమలా హ్యారిస్ సుమారు 85 నిమిషాల పాటు దేశాధ్యక్షురాలి బాధ్యతలను చేపట్టారు. అధ్యక్ష అధికారాలను ఆమె వినియోగించుకున్నారు.
సుమారు గంటకు పైగా అధికారంలో ఉన్న కమలా హ్యారిస్.. వైట్‌హౌజ్ లోని వెస్ట్ వింగ్ ఆఫీసు నుంచి తన విధులను నిర్వర్తించారు. అప్పటి వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ అధికార మార్పిడి గురించి వివరించారు. అమెరికా రాజ్యాంగంలో ఉన్న విధానాల ప్రకారమే .. స్వల్ప సమయం పాటు అధికారాన్ని అప్పగించడం జరిగిందన్నారు. అమెరికా రాజ్యాంగంలోని 25వ అధికరణ ప్రకారం.. ఒకవేళ దేశాధ్యక్షుడు ఆఫీసు నుంచి వైదొలిగినా, లేక మరణించినా, లేక రాజీనామా చేసినా, ఆ సమయంలో ఉపాధ్యక్షులు.. అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తారని తెలిపారు.
25వ అధికరణలోని మూడవ సెక్షన్లో తాత్కాలిక అధికార మార్పిడి గురించి ఉన్నది. 1963లో దేశాధ్యక్షుడు కెన్నడీ హత్యకు గురైన సమయంలో ఆ సెక్షన్ తీసుకువచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

