Transgender Murder | హైదరాబాద్ : హైదరాబాద్ సనత్ నగర్లోని ఫతేనగర్ పిట్టల బస్తీలో ట్రాన్స్జెండర్ షీలాను ముక్కలుముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు. నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహం చూసిన స్థానికులు 100 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. గుర్తుతెలియని వ్యక్తులు గంజాయి మత్తులో హత్య చేసి ఉంటారు అని ట్రాన్స్జెండర్లు అనుమానం చేస్తున్నారు.
డబ్బు కోసం హత్య చేసి ఉంటారని బాలానగర్ ఏసీపీ హనుమంతురావు అనుమానం వ్యక్తం చేశారు. హత్య ఉదంతం తెలుసుకున్న తోటి ట్రాన్స్ జెండర్లు సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఘటనాస్థలిలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఫతేనగర్ పిట్టల బస్తీలో ట్రాన్స్ జెండర్ దారుణ హత్య..
నిర్మానుష్య ప్రాంతంలో ట్రాన్స్ జెండర్ డెడ్ బాడీ చూసి పోలీసులకు సమాచారం
ట్రాన్స్ జెండర్ హత్యపై క్లూస్ సేకరిస్తున్న పోలీసులు.
గంజాయి మత్తులో హత్య చేశారని హిజ్రాలు తెలుపుతున్నారు… https://t.co/Cb91Pn3nl9 pic.twitter.com/mBQAYFCKD5
— Telugu Scribe (@TeluguScribe) July 12, 2024
ఇవి కూడా చదవండి..
Rains | హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం.. ఉక్కపోతకు ఉపశమనం..
MS Dhoni | కుటుంబసమేతంగా అనంత్ అంబానీ పెళ్లికి ధోనీ.. డ్రెస్ అదుర్స్.. Video
James Anderson | క్రికెట్ చరిత్రలో ‘అసామాన్యుడు’.. అండర్సన్ మైలురాళ్లు ఇవే..!