హైదరాబాద్: పవిత్రమైన రంజాన్ (ఈద్ ఉల్ ఫీతర్) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) అమలులో ఉండనున్నాయి. ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు జూపార్క్ సమీపంలోని మీరాలం ట్యాంక్ ఈద్గా, మాసబ్‌ట్యాంక్‌లోని హాకీ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. దీంతో బహదూర్‌పురా, కాలాపత్తర్, నవాబ్ సాహెబ్ కుంట, శాస్త్రి పురం, దానమ్మ హట్స్, మాసబ్ ట్యాంక్, ఎన్ఎండీసీ, ఖాజా మ్యాన్షన్, బంజారాహిల్స్ 1/12 జంక్షన్, పీటీఐ జంక్షన్ వద్ద మళ్లింపులు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
హనదారులు డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు. ఏదైనా అత్యవసరమైతే 9010203626 ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని సూచించారు.