Hyderabad | హైదరాబాద్ : మలక్పేట రైల్వే బ్రిడ్జి నుంచి ముసారాంబాగ్ వెళ్లే మార్గంలో రహదారిపై మురుగునీరు పారుతోంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు జలమండలి అధికారులు మరమ్మతులు చేపట్టారు.
ఈ పనుల కారణంగా చాదర్ఘాట్ నుంచి దిల్సుఖ్నగర్ వైపు వెళ్లే వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం చేశారు. నల్లగొండ ఎక్స్ రోడ్డు మీదుగా కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని వాహనదారులకు పోలీసులు సూచించారు. నిన్నటి నుంచి చాదర్ఘాట్ – నల్లగొండ ఎక్స్ రోడ్డు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న సంగతి తెలిసిందే.