సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలి ఓఆర్ఆర్ సమీపంలో జీహెచ్ఎంసీ చేపడుతున్న గ్రిడర్ ఎరెక్షన్ పనుల కారణంగా నాలుగు రోజులు రాత్రి వేళల్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిర్ణీత రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
-హఫీజ్‌పేట్ నుంచి టోలీచౌకి వయా కొత్తగూడెం రోడ్డు మీద వచ్చే వాహనాలను రోలింగ్ హిల్స్ వద్ద రాంకీ టవర్స్, ఐఏజీ వైద్యశాల, మైండ్ స్పెస్ జంక్షన్‌కు మళ్లిస్తారు.
-లింగంపల్లి నుంచి టోలీచౌకి వైపు వచ్చే వెహికిల్స్ ఓఆర్ఆర్ నుంచి నానక్‌రాంగూడ, ఖాజాగూడ రూట్లలోకి..
ఆర్జీఐఏ నుంచి ఓఆర్ఆర్ మీదుగా టోలీచౌకి వైపు వచ్చేవి గచ్చిబౌలి జంక్షన్ వద్ద యూటర్న్ తీసుకొని ఓఆర్ఆర్, నానక్‌రాంగూడ, కాజాగూడ వైపు పంపిస్తారు.
-టోలీచౌకి నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలు ఈఎస్సీఐ రోడ్డు మీదుగా ఖాజాగూడ, నానక్‌రాంగూడ, ఓఆర్ఆర్ జంక్షన్ వైపు వెళ్లాలి.