సికింద్రాబాద్: సికింద్రాబాద్ ప్యారడైజ్ ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఫ్లైఓవర్ సమీపంలో రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో కార్లలో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంతో ఫ్లైఓవర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. దీంతో ప్రమాదానికి గురైన రెండు కార్లను తొలగించిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.