సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఎల్బీ స్టేడియంలో మంగళవారం బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాలలో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు.