రవీంద్రభారతి, మార్చి25 : కరెన్సీ నోట్లపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బొమ్మను ముద్రించాలని అంబేద్కర్ ఫోటో సాధన సాధన సమితి జాతీయ సలహాదారుడు , ఓబీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. తమ ఆశయ సాధన కోసం బుధవారం నాడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉదయం 9 గంటలకు వందలాది మంది కళాకారులతో భారీ ఎత్తున ధూంధాం ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు ధూంధాం వాల్ పోస్టర్ను ఆయన మంగళవారం నాడు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. కరెన్సీ నోట్లపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఏండ్ల నుంచి అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంబేద్కర్ ఫోటోను నోట్లపై ముద్రించాలని దేశంలోని అన్ని బహుజన పార్టీలు, మేధావులు, విద్యార్థులు కోరినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ స్పందించి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను ప్రింట్ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం జరిగే ధూంధాం కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కళాకారులు , మేధావులు, విద్యార్థులు విచ్చేసి విజయవంతం చేయాలని ఆళ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. న్నారు.ఢిల్లీలో జరిగే ధూం ధాం కళాకారుల సాంస్కృతిక కార్యక్రమంతో పాలకుల్లో స్పందన రావాలని ఆయన ఆకాంక్షించారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను వేయాలని ఆయన డిమాండ్ చేశారు.లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఆళ్ల రామకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.