Hayathnagar | హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. పెద్ద అంబర్పేట సదాశివ ఎంక్లేవ్లో ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డ దొంగలు ఇంట్లోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, విలువైన పట్టు చీరలు ఎత్తుకెళ్లారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, పోలీసుల నిఘా వైఫల్యం వల్లే దొంగతనాలు జరుగుతున్నాయని, ఇప్పటికైనా గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.