హైదరాబాద్ : తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధలో దొంగలు(Thieves) బీభత్సం సృష్టించారు. ప్రజలు పండుగలకు సొంతూర్లకు వెళ్లగా ఇదే అదునుగా భావించిన దుండగులు పలు ఇండ్లలో చొరబడి అందినకాడికి దండుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..తెల్లాపూర్ మున్సిపాలిటీ(Telapur municipality) పోచారంలో మూడు ఇండ్లలో దొంగలు చొనబడ్డారు. 6 తులాల బంగారం(Gold), ఓ ల్యాప్టాప్ ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.
ఇవి కూడా చదవండి..
TGPSC | నేటి నుంచి గ్రూప్-1 హాల్టికెట్లు.. మరికాసేపట్లో విడుదల చేయనున్న టీజీపీఎస్సీ
CPI Narayana | సాయిబాబాది సహజ మరణం కాదు, అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే : సీపీఐ నారాయణ
KTR | కాంగ్రెస్ పాలనపై నిరసనలకు సిద్ధమవుతున్న ప్రజలు.. ముఖ్రాకే వాసులకు కేటీఆర్ మద్దతు