బంజారాహిల్స్.ఏప్రిల్ 5: ఇంటికి తాళం వేసి ఆఫీసుకు వెళ్లివచ్చేసరికి బంగారు ఆభరణాలు(Gold) చోరీకి(theft) గురయిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లోని హైలమ్ కాలనీలో నివాసం ఉంటున్న పామర్తి నాగేంద్ర అనే యువకుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం(Software employee) చేస్తుంటాడు. ఈ నెల 3న రాత్రి 11గంటలకు ఇంటికి తాళం వేసి ఆఫీసుకు వెళ్లిన నాగేంద్ర మరుసటిరోజు ఉదయం వచ్చాడు.
ఇంటికి వచ్చి చూడగా గదిలో ఉండాల్సిన రూ.73వేల నగదుతోపాటు 21గ్రాముల బంగారు గొలుసు, 20 గ్రాముల బ్రాస్లెట్, రెండు ఉంగరాలు కనిపించలేదు. గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి చోరికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ శుక్రవారం బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.