మేడ్చల్ జోన్ బృదం జూలై 27: నాలుగైదు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షంతో నియోజకవర్గ వ్యాప్తంగా చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో జన జీవనానికి ఆటంకం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ స్తంభించకుండా మున్సిపాలిటీల సిబ్బంది అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.