హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎండలు మండుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి నమోదవుతుండటంతో నగర వాతావరణం వేసవిని తలపిస్తున్నది. ఉదయం నుంచే భానుడు ప్రతాపాన్ని చూపుతుండటంతో మళ్లీ ఉక్కపోత సమస్య తప్పడం లేదు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 33.6, కనిష్ఠం 22.9 డిగ్రీలు, గాలిలో తేమ 51శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాత్రి సమయాల్లో మరింత ఉక్కపోతగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.