స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని..మెట్రో ప్రయాణికుల కోసం సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్ను ప్రకటించింది ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ. ఈ ప్రత్యేక ఆఫర్ను ప్రయాణికులు మూడు రోజులు పాటు వినియోగించుకోవచ్చు. సూపర్ సేవర్ మెట్రో హాలీడే కార్డును రోజుకు రూ. 59లతో రీచార్జి చేయడం ద్వారా 12, 13, 15 తేదీల్లో అపరిమితంగా మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చు.
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన మెట్రోలో నగరవాసులు ఎంతో ఇష్టంగా ప్రయాణం చేస్తున్నారని, అలాంటి వారికి ఈ ఆఫర్ ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తుందని ఎల్ అండ్ టీ మెట్రో సీఈవో, ఎండీ కేవీబీరెడ్డి తెలిపారు.