సిటీబ్యూరో, జూలై 31(నమస్తే తెలంగాణ): ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలను జీహెచ్ఎంసీలోకి విలీనానికి ముహూర్తం ఖరారయింది. ఓఆర్ఆర్ లోపలి వరకు జీహెచ్ఎంసీని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిన దరిమిలా మేడ్చల్ -మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయయతీలు జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి.
ఈ మేరకు గురువారం జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించనున్నారు. శుక్రవారం జరిగే అసెంబ్లీ సమావేశంలో సభ్యుల ఆమోదానికి ఈ ప్రతిపాదనపై చర్చించనున్నారు. ఇప్పటికే హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటుచేయగా, తాజాగా ఈ విలీన ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.