మెహిదీపట్నం ఆగస్టు 22 : బైక్‌పై వెళ్తున్న దంపతులను లారీ ఢీ కొట్టడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ మెహిదీపట్నంలో రేతిబౌలి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గోల్కొండ ఎండీలైన్స్‌లో నివసించే మహ్మద్ సాబేర్(36) ప్రైవేట్ ఉద్యోగి. ఆదివారం తన భార్యతో కలిసి తన పల్సర్ వాహనంపై మెహిదీపట్నం నుంచి రేతిబౌలి వైపు వస్తుండగా పీవీ.నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 35 వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన కర్ణాటకకు చెందిన లారీ ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో కింద పడ్డ భర్తపై నుంచి లారీ వెళ్లడంతో అతను తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య స్వల్ప గాయాలతో బయటపడింది. భర్త మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇదిలా ఉండగా సంఘటనా స్థలంలో లారీ డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.