హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ఖానామెట్‌లోని సర్వే నెం.14/12, 14/13, 14/14లోని వేల కోట్ల రూపాయల విలువైన భూములు ప్రభుత్వానికి చెందినవే అని మంగళవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈభూములపై హక్కులు కోరుతూ ప్రైవేటు కంపెనీఇటినా ప్రాపర్టీస్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయడంతోపాటు సదరు సంస్థకు రూ.5లక్షల జరిమానా విధించింది.
భూములకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించిన వ్యవహారంలో అధికారుల పాత్రపై సిట్‌ను ఏర్పాటు చేయాలంటూ డీజీపీని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక తీర్పు వెలువరించారు. దీనికి సంబంధించి 4 వారాల్లోగా సీఎస్, రెవెన్యూ కార్యదర్శికి నివేదికను సమర్పించాలని ఆదేశించింది.