నిమ్స్ ఉద్యోగులపై పర్యవేక్షణేది!
నిమ్స్ వైద్యశాలలో వెలుగుచూసిన కిడ్నీ దందా వ్యవహారం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది. డయాలసిస్ రోగులను లక్ష్యంగా చేసుకొని కిడ్నీ ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన ఘటనలో ఓ వార్డు బాయ్ మాత్రమే కాకుండా మరికొందరి ప్రమేయమూ ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ వ్యవహారం కొనసాగుతున్నదన్న ఆరోపణలున్నాయి.
- రెండేండ్లకుపైగా సాగుతున్న కిడ్నీ దందా
- పెద్దల హస్తంపై ఉద్యోగుల అనుమానాలు
- నిందితుడు నాగరాజును విచారిస్తున్న పోలీసులు
ఖైరతాబాద్: నిమ్స్ వైద్యశాలలో వెలుగుచూసిన కిడ్నీ దందా వ్యవహారం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది. డయాలసిస్ రోగులను లక్ష్యంగా చేసుకొని కిడ్నీ ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన ఘటనలో ఓ వార్డు బాయ్ మాత్రమే కాకుండా మరికొందరి ప్రమేయమూ ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ వ్యవహారం కొనసాగుతున్నదన్న ఆరోపణలున్నాయి. 2023 నవంబర్‌లో నిందితుడు నాగరాజు పరిచయమైనట్లు బాధితులు చెబుతుండగా, రెండు సంవత్సరాలకు పైగానే ఈ వ్యవహారం కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది.
డయాలసిస్ రోగులతో వార్డులోనే సంప్రదింపులు జరుపుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నా.. విషయం యాజమాన్యం దృష్టికి వెళ్లకపోవడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల విధులను పర్యవేక్షించే బాధ్యత సూపర్వైజర్లపై ఉంటుంది. వార్డు బాయ్‌ల పనితీరును ఎప్పటికప్పుడు గమనించాలి. ఈ వ్యవహారం ఇంత కాలం బయటపడక పోవడంపై ఆస్పత్రి ఉద్యోగులే ఆశ్చర్యపోతున్నారు. ఈ విభాగంలోని ఉద్యగులందరినీ పర్యవేక్షించాల్సిన బాధ్యత ఓ డిప్యూటీ స్థాయి వైద్యాధికారిపై ఉంటుంది.
కానీ రెండు సంవత్సరాలకు పైగా ఈ వ్యవహారం సాగుతున్నా.. పట్టించుకోకపోవడంపై పలువురు ఉద్యోగులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంలో మరెవరైనా ఆస్పత్రి సిబ్బంది ప్రమేయం ఉందా..? డబ్బుల లావాదేవీలు ఎవరెవరి ద్వారా జరిగాయి..? ఎంత మంది బాధితులు ఉన్నారు..? అనే కోణాల్లో పోలీసుల విచారిస్తున్నట్లు తెలిసింది. నిందితుడు నాగరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడి కాల్ డేటా, ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. యాజమాన్యం సైతం అంతర్గత విచారణను వేగవంతం చేసినట్లు సమాచారం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

