హైదరాబాద్ మహానగర ట్రై పోలీస్ కమిషనరేట్లకు కొత్త పోలీస్ బాస్‌లను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు డీజీపీగా (అర్గనైజేషన్ అండ్ లీగల్) ఉన్న 1994 బ్యాచ్‌కు చెందిన కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించింది. సైబరాబాద్ జాయింట్ సీపీ (అడ్మిన్)గా కొనసాగుతున్న ఐజీ 2005 బ్యాచ్‌కు చెందిన అవినాశ్ మహంతిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా, 2001 (ఏపీఎస్) బ్యాచ్‌కు చెందిన జి.సుధీర్‌బాబును రాచకొండ పోలీస్ కమిషనర్‌గా నియమించారు. హైదరాబాద్ సీపీగా పనిచేస్తున్న సందీప్ శాండిల్యను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్‌గా నియమించింది. రాచకొండ, సైబరాబాద్ సీపీలుగా కొనసాగిన డీఎస్ చౌహాన్, స్టీఫెన్ రవీంద్రలను డీజీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
– సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగర ట్రై పోలీస్ కమిషనరేట్లకు కొత్త పోలీస్ బాస్‌లను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు డీజీపీ (ఆర్గనైజేషన్ అండ్ లీగల్) కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా, సైబరాబాద్ జాయింట్ సీపీ (అడ్మిన్)గా కొనసాగుతున్న ఐజీ (2005 బ్యాచ్) అవినాష్ మహంతిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా, 2001 బ్యాచ్‌కు చెందిన జి.సుధీర్‌బాబును రాచకొండ పోలీస్ కమిషనర్‌గా నియమించారు.
హైదరాబాద్ సీపీగా పనిచేస్తున్న సందీప్ శాండిల్యను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్‌గా నియమించారు. రాచకొండ, సైబరాబాద్ సీపీలుగా కొనసాగిన డీఎస్ చౌహాన్, స్టీఫెన్ రవీంద్రను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సిబ్బందికి దిశా నిర్దేశం చేయడం.. ప్రజలకు పారదర్శకంగా సేవలందించేలా చేయడంతో పాటు చట్టాన్ని అతిక్రమించే వారికి సింహ స్వప్నంలా ఉంటారని ట్రై పోలీసు కమిషనరేట్ల కొత్త కమిషనర్లకు పేరుంది.
హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీగా కొనసాగుతున్న జి.సుధీర్‌బాబుకు హైదరాబాద్‌తో పాటు రాచకొండ కమిషనరేట్‌పై గట్టి పట్టుంది. మహబూబ్‌నగర్ ఎస్పీగా, టాస్క్‌ఫోర్స్, అల్వాల్, శంషాబాద్ డీసీపీగా, వరంగల్ సీపీగా పనిచేశారు. అనంతరం రాచకొండ జాయింట్ సీపీగా పనిచేసిన ఆయన.. ఐజీగా పదోన్నతి పొందిన తరువాత హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీగా బాధ్యతలు చేపట్టారు. ఎక్కడ పనిచేసినా అక్కడ ఆయన తనకంటూ ఒక ముద్ర వేసుకుంటారు. సిబ్బంది కచ్చితంగా విధులు నిర్వహించేలా చేయడం, ప్రజలకు పారదర్శకంగా సేవలందించేలా సిబ్బందికి దిశా నిర్దేశం చేస్తూ సేవలందిస్తారు. రాచకొండలో జాయింట్ సీపీగా పనిచేసిన అనుభవం ఉండటంతో కమిషనరేట్‌పై మంచి పట్టుంది. దీంతో ప్రభుత్వం ఆయనను రాచకొండ పోలీస్ కమిషనర్‌గా నియమించింది.