హైదరాబాద్ : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో(Medchal Police station) గోనె సంచిలో(Gunny sack) బాలిక మృతదేహం(Girl dead body) లభించడం స్థానికంగా కలకలం రేపింది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ బాసరగుడి గ్రామంలో గోనె సంచిలో బాలిక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచార మిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారా? అనే కోణంలో సైతం పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Suryapet | కొడుకు అన్నం పెట్టడం లేదంటూ కంటతడి పెట్టిన కన్నతల్లి.. ఆర్డీవోకు ఫిర్యాదు
Amshula Satyanarayana | ఫ్లోరైడ్ ఉద్యమకారుడు అంశుల సత్యనారాయణ మృతి