ప్రజావాణి వినరా.?
ప్రజా సమస్యలపై ప్రజల నుంచి ఎప్పటికప్పుడు దరఖాస్తులను స్వీకరించి పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించతలపెట్టిన ప్రజా వాణి కార్యక్రమాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నది.
- ఫిర్యాదుల స్వీకరణకు ఉన్నతాధికారులు దూరం
- కిందిస్థాయి అధికారులతోనే దరఖాస్తుల స్వీకరణ
- సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం
- ప్రజలు ప్రశ్నిస్తే తప్పించుకు తిరుగుతున్న అధికారులు
- ప్రజావాణిని నీరుగార్చే ప్రయత్నమంటూ అరోపణలు
మేడ్చల్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : ప్రజా సమస్యలపై ప్రజల నుంచి ఎప్పటికప్పుడు దరఖాస్తులను స్వీకరించి పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించతలపెట్టిన ప్రజా వాణి కార్యక్రమాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నది. గతంలో కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు డిప్యూటీ కలెక్టర్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించి వెంటనే పరిష్కారం చూపేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావాణి వినేందుకు జిల్లాస్థాయి అధికారులు దూరంగా ఉంటున్నారు. ప్రజావాణి కార్యక్రమంలో కిందిస్థాయి అధికారులచే దరఖాస్తులను స్వీకరించి వాటిని పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రజాలు ఇచ్చిన దరఖాస్తుల విషయమై అధికారులను నిలదీస్తే ఎలాంటి సమాదానం చెప్పకుండా దాటవేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో నాలుగు వారాల పాటు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 583 దరఖాస్తులు రాగా.. వాటిని పూర్తిస్థాయిలో పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ నెల 12వ తేదీ నుంచి మూడు వారాలుగా నిర్వహిస్తున్న ప్రజావాణిలో లా ఆఫీసర్ చంద్రావతి పాల్గొని దరఖాస్తులు స్వీకరించగా, 19వ తేదీన జరిగిన ప్రజావాణిలో డీఆర్వో హరిప్రియ పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. 26న జరిగిన ప్రజావాణిలో సెక్షన్ సూపరింటెండెంట్ గీత, భూపాల్ దరఖాస్తులను స్వీకరించారు. అయితే అధికారులు స్వీకరించిన దరఖాస్తులను ఉన్నతాధికారులు పట్టించుకోకుండా ప్రజావాణి కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రజావాణిలో ఉన్నతాధికారులు పాల్గొని దరఖాస్తులు స్వీకరించడంతో పాటు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకు సమాచారం అందించాలని ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

