RTC Buses | సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనున్నది. అందులో భాగంగా నగర నలుమూలల నుంచి క్రికెట్ అభిమానులకు ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ అధికారులు 60 ప్రత్యేక బస్సులను ఉప్పల్ స్టేడియానికి నడపనున్నారు. ఘట్కేసర్, హయత్‌నగర్, ఎన్జీఓ కాలనీ, ఇబ్రహీంపట్నం, ల్యాబ్ క్వార్టర్స్, కోఠి, అఫ్జల్‌గంజ్, లక్డీకపూల్, జీడిమెట్ల, మియాపూర్, హఫీజ్‌పేట్, ఈసీఐఎల్, బోయినపల్లి, బీహెచ్ఈఎల్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల నుంచి స్టేడియానికి బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. మరింత సమాచారం కోసం 99592 26160, 99592 26154 నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు.