TGSRTC | ఎల్బీనగర్, జూలై 29 : టీజీఎస్ ఆర్టీసీ దిల్సుఖ్నగర్ డిపో నుండి ఆగస్టు 2వ తేదీన టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు దిల్సుఖ్నగర్ సిటీ డిపో మేనేజర్ సమత ఒక ప్రకటనలో తెలిపారు. 40 మంది కెపాసిటీ గల మెట్రో డీలక్స్ బస్సును విహారయాత్ర కోసం ఏర్పాటు చేస్తున్నామని ఆమె తెలిపారు. ఆగస్టు 2వ తేదీన శనివారం ఉదయం 5 గంటలకు బస్సు బయలుదేరి నాగార్జున సాగర్ టూర్ చేసి రాత్రి 8 గంటల వరకు దిల్సుఖ్నగర్ చేరుకుంటుందని ఆమె తెలిపారు. ఈ టూర్లో భాగంగా మొదటగా చింతపల్లి సాయిబాబా దేవాలయం, నాగార్జున సాగర్ డ్యామ్, వైజాగ్ కాలనీ, ఎత్తిపోతలను చూపిస్తారన్నారు. ఈ టూర్ ప్యాకేజీ కోసం పెద్దలకు రూ. 900, పిల్లలకు రూ. 500 చార్జీ చేస్తున్నామని, ఇతర వివరాలకు ఫోన్ నెంబర్ బుచ్చిరెడ్డి 7989928321, ఎంఎస్‌రెడ్డి 9063102132లలో సంప్రదించాలని ఆమె కోరారు.