తెలుగు యూనివర్సిటీ, సెప్టెంబర్ 24: తెలుగు వర్సిటీ బోధనకే పరిమితం కాకుండా తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, లలితకళలను విశ్వవ్యాప్తం చేసే దిశగా కృషి చే యడం అభినందనీయమని ఉస్మానియా వి శ్వ విద్యాలయం పట్టణ పర్యావరణ ప్రాం తీయ అధ్యయన కేంద్రం పూర్వ సంచాలకులు ఆచార్య ఎస్.భూపతిరావు అన్నారు.
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2024కు గాను వివిధ రంగాలలో విశేష కృషి చేసిన 24మందికి మంగళవారం కీర్తి పురస్కారాలను ప్రదానం చేసి సత్కరించింది. తెలుగు వర్సిటీ వీసీ ఆచార్య వీ నిత్యానందరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు, విస్తరణ సేవా విభాగం అసిస్టెంట్ డైరక్టర్ రింగురామ్మూర్తి పాల్గొన్నారు. వ్యక్తిత్వ వికాసంలో పురస్కారం అందుకున్న 92ఏళ్ల వయసుగల ప్రముఖ ఇంజనీర్ తిరువక్కల్ శోభనాద్రి తెలుగు వర్సిటీకి 50వేల రూపాయాలను విరాళంగా అందజేశారు.
గ్రహీతల వివరాలు…
కీర్తి పురస్కారాలను ఆచార్య సత్యలక్ష్మి(మహిళాభ్యుదయం), పద్మ మధునాపంతుల (లలిత సంగీతం), బీవీ దుర్గా భవానీ (శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు), గిద్దె రామనర్సయ్య (జానపద గాయకులు), ఆచార్య చిగిచర్ల కృష్ణారెడ్డి (జానపద కళలు), గోవిందరాజు చక్రధర్ (పత్రికారచన), వీణారెడ్డి (ఉత్తమ రచయిత్రి), ఆచార్య లావణ్య (ఉత్తమ రచయిత్రి), డాక్టర్ బీహెచ్ పద్మప్రియ (ఉత్తమ నటి), రామకృష్ణ (ఉత్తమ నటుడు), డాక్టర్ వెంకట్ గోవాడ (పద్య రచన), పి.ఉమామహేశ్వర పాత్రుడు (ఆంధ్రనాట్యం), డాక్టర్ కే రత్నశ్రీ (కూచిపూడి నృత్యం), తిరువక్కల్ శోభనాద్రి (వ్యక్తిత్వ వికాసం), సాంబశివరావు (హేతువాద ప్రచారంలో కృషి), డాక్టర్ యాదగిరి (గ్రంథాలయ సమాచార విజ్ఞానం), ఎన్.సు భాషిణి (గ్రంథాలయకర్త), కమలాకర భారతీదేవి (సాంస్కృతిక సంస్థ నిర్వహణ), కుమారి రమ్యశ్రీ (ఇంద్రజాలం), నెల్లుట్ల వెంకటరమణ రావు (కార్టూనిస్ట్), డాక్టర్ కల్పవల్లి (జ్యోతిషం), పురిమళ్ల సునంద (ఉత్తమ ఉపాధ్యాయులు), డాక్టర్ శ్రీనివాసాచారి (చిత్రలేఖనం), కుంట సైదయ్య (జానపద కళలు)కు పురస్కారాలు అందజేశారు. ఒక్కొక్కరికి రూ.5,116 నగదు, శాలువా, అభినందన పత్రాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు.