Bus Pass | సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): విద్యార్థులకు బస్సు పాస్‌ల జారీ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమవుతుందని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేటర్లో ఆరాంఘర్, అఫ్జల్‌గంజ్, బాలానగర్, బోరబండ, సీబీఎస్,చార్మినార్, దిల్షుక్నగర్, ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్, ఫరూక్నగర్, హయత్‌నగర్,
ఇబ్రహీంపట్నం, జేబీఎస్, కాచిగూడ, కోటి, కేపీహెచ్‌బీ, కూకట్పల్లి, లక్డికపూల్, ఎల్బీనగర్, లింగంపల్లి, లోతుకుంట, మేడ్చల్, మెహిదీపట్నం, మిథాని, మొయినాబాద్, ఎన్జీఓ కాలనీ, పఠాన్ చెరు, రైతిఫైల్ సికింద్రాబాద్, ఆర్జీఐ ఎయిర్పోర్ట్, సనత్‌నగర్, సెక్రటేరియెట్, శంషాబాద్, ఎస్ఆర్నగర్, షాపూర్‌నగర్, తార్నాక, ఉప్పల్, ఉమెన్స్ కాలేజీకోఠి కేంద్రాల్లో బస్సు పాస్‌లు పొందొచ్చని వివరించారు. సమాచారం కోసం 8008204216, tgsrtcpass.com ను సంప్రదించొచ్చని పేర్కొన్నారు.