Ticket Price Hike | జంట నగరాల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ షాక్ ఇచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో బస్సు చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ -ఆర్డినరీ, ఈ-ఎక్స్ప్రెస్ బస్సుల్లో తొలి మూడు స్టేజీల వరకు రూ.5 చొప్పున పెంచింది. ఇక నాల్గో స్టేజీ నుంచి అదనంగా రూ.10 వసూలు చేయనున్నారు. మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ బస్సుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ తర్వాత అదనంగా రూ.10 వసూలు చేయనున్నారు. పెరిగిన ధరలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని సంస్థ పేర్కొంది.
అయితే, టికెట్ల ధరలను ఎలక్ట్రిక్ బస్సుల మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు పెంపు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. దశలవారీగా హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల రాబోయే రెండేళ్లలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తుంది. డీజిల్ బస్సుల స్థానంలో ఈవీ బస్సులను తీసుకురావాలని భావిస్తుంది. ఇందు కోసం అదనంగా మరో పది డీపోలను ఏర్పాటు చేయాలని.. పది ఛార్జింగ్ స్టేషన్లు అవసరమని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ప్రజలు సహకరించాలని ఆర్టీసీ ఓ ప్రకటనలో కోరింది.