హైదరాబాద్ : చోరీకి గురైన లేదా పొరపాటున పోగొట్టుకున్న సెల్ఫోన్ ఫోన్లను(Cellphones)ట్రేస్ చేసి, వాటిని యజమానులకు అప్పగించడంలో తెలంగాణ పోలీసులు సత్తా చాటుతున్నారు. తాజాగా సెల్ఫోన్ రికవరీలో (Recovery) తెలంగాణ రాష్ట్రం(Telangana) రెండో స్థానంలో నిలిచింది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ప్రారంభించిన 396 రోజుల్లో 30,049 ఫోన్లు రికవరీ చేశారు. 35,945 సెల్ఫోన్స్ రివకరీలో కర్నాటక(Karnataka) రాష్ట్రం మొదటి స్థానంలో కొనసాతుండగా 7387 సెల్ఫోన్స్ రికవరీల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది.