GHMC | సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధి విస్తరిం చి, నాలుగు ముక్కలు కానున్నది. ఔటర్ రింగు రోడ్డును సరిహద్దుగా చేసుకొని ఏర్పాటు చేయనున్న హైదరాబాద్ మహానగరాన్ని పరిపాలనా సౌలభ్యం, నిధుల లభ్యతకోసం ఒకటే కార్పొరేషన్ కాకుండా ఒకేసారి 4 కార్పొరేషన్లుగా ఏర్పా టు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న ది.
ఓఆర్ఆర్ లోపల ప్రస్తుతం జీహెచ్ఎంసీతో పాటు శివారు ప్రాంతాల్లో ఏడు మున్సిపల్ కా ర్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలను కలిపి కొత్తగా 4 గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చే యాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే కసర త్తు ప్రారంభించింది. ఓఆర్ఆర్ లోపల ఉన్న గ్రామ పంచాయతీలను సైతం పక్కనే ఉన్న ము న్సిపాలిటీల్లో విలీనం చేయడంతో ఈ ప్రక్రియ మరింత వేగం పుంజుకున్నది.
సుమారు 51 గ్రామపంచాయతీలను విలీనం చేసినట్లు ప్రభు త్వం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తు తం జీహెచ్ఎంసీ పదవీకాలంతో పాటు శివారు ప్రాంతాల్లోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలకు ఈ ఏడాది చివరి వరకు గడువు ఉండటంతో ఈ లోపే గ్రేటర్ హైదరాబాద్‌ను ఎన్ని భాగాలు చేయాలో నిర్ణయించనున్నారు. ఇదే విషయమే ఇటీవల మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్‌ను 4 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తామని, నలుగురు మేయర్లు వస్తారని ప్రకటించడంతో మరింత స్పష్టత వచ్చింది.
4 కార్పొరేషన్ల పేర్లపై కసరత్తు..
ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలోకి ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలను విలీ నం చేసిన తర్వాత 4 కార్పొరేషన్లుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టిం ది. ఓఆర్ఆర్ లోపలి భాగంగా ఉన్న మొత్తం ప్రాంతాన్ని 4 కార్పొరేషన్లు అంటే… హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, శంషాబాద్ పేర్లతో నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పా టు చేస్తే అన్ని విధాలా సహేతుకంగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
సుమారు 2500 చదరపు కి.మీ..
ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ విస్తీర్ణం 625 చదరపు కి.మీలు ఉండగా, ఓఆర్ఆర్ వరకు విస్తరించడంవల్ల ఒకేసారి దాని పరిధి సుమారు 2500 చదరపు కి.మీ మేర అయ్యే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన డివిజన్లు చేసి, 4 కార్పొరేషన్లలో డివిజన్లు సమానంగా ఉండేలా నిర్ణయించిన తర్వాత ఎన్నికలకెళ్లే అవకాశం ఉంది.
విలీనంతో ఓఆర్ఆర్ లోపల..
ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ, 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలన్నీంటినీ ఒక్కటిగా మార్చ డం ద్వారా ఓఆర్ఆర్ లోపల నివాసముండే జనాభా ఒకేసారి 1.80 లక్షల నుంచి 2 కోట్లకు చేరుకుంటుందని అంచనా. హెచ్ఎండీఏను ట్రిపుల్ఆర్ వరకు విస్తరిస్తే దాని కోసం కొత్తగా మాస్టర్‌ప్లాన్‌ను 2050 పేరుతో రూపొందిస్తే ప్ర ణాళికాబద్ధమైన పట్టణీకరణ హెచ్ఎండీఏ పరిధిలోనూ వస్తుందని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.
శంషాబాద్ పేరు ప్రతిపాదన..
హైదరాబాద్ మహానగరాన్ని ఆయా ప్రాంతాలను బట్టి ట్రై సిటీస్‌గా అభివర్ణిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు తోడు కొత్తగా మరో ‘బాద్’గా శంషాబాద్ పేరును ఖరారు చేయనున్నట్లు సమాచారం.