సికింద్రాబాద్, జూన్2: ఎన్నో త్యాగాలు, ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం కలగాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి. పద్మారావు గౌడ్ ఆకాంక్షించారు. సికింద్రాబాద్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. సీతాఫల్ మండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పద్మారావు గౌడ్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రను తాము నిర్వర్తించామని, సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజల సహకారం మరవలేనిదని తెలిపారు. ఉద్యమకారులను తాము గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామని అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. కార్పొరేటర్లు హేమ, శైలజ, సునీత, ప్రసన్న లక్ష్మి, యువ నేత రామేశ్వర్ గౌడ్ తో పాటు సీ తాఫల్ మండి ఆసుపత్రి వైద్యాధికారులు, బీ ఆర్ ఎస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్ 2sec1: సీతాఫల్ మం డి క్యాంపు కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తదితరులు.