Telangana activists | ఎన్నికల ముందు అమరవీరులను, ఉద్యమకారుల త్యాగాలను గుర్తుంచి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 25 వేలు పెన్షన్ ఇస్తానంటూ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని తెలిసిందే. అమరవీరులకు ఇచ్చిన హామీని నెరవేర్చని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై తెలంగాణ ఉద్యమకారులు ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమకారులు గాంధీభవన్ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఉద్యమకారులు ఇచ్చిన హామీలు, 250 గజాల స్థలం, గౌరవవేతనం అమలు చేయాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిక్షాటన చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఉద్యమకారులను చెదరగొట్టి వ్యానులో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
గాంధీ భవన్ ముందు తెలంగాణ ఉద్యమకారుల ఆందోళన
కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బిక్షాటన
అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు https://t.co/25XL51t87U pic.twitter.com/J7H4GEyaK3
— Telugu Scribe (@TeluguScribe) April 30, 2026